కడప నగరంలోని శివానందపురంలో మౌలిక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం ఏర్పడి ఏళ్లు గడుస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉందన్నారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యతో కొట్టుమిట్టాడుతుండగా, మరో వైపు రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. కాలనీలోకి ప్రధాన మార్గం అయిన కొంత మేర సిమెంట్ రోడ్డు దర్శనమిస్తే.. ఇంకొంత మేర గోతులు పడిన రోడ్డు దర్శనమిస్తున్నాయి. వాహనాలపై వస్తే కచ్చితంగా గోతుల్లో ఇరుక్కుని టైర్లు దెబ్బతినటంతో పాటు వెన్ను సమస్యలు కూడా వస్తున్నాయని మెురపెడుతున్నారు. వీటికి తోడు కాలనీలో కుక్కలు, పందుల బెడద ఎక్కువైందని చెబుతున్నారు.