వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. చెరువులు, కాలువల్లో నిమర్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. నగర పరిధిలోని సమీపంలో కమలాపురానికి వెళ్లే దారిలో విగ్రహాలు నీట మునగకపోవడంతో సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందని వాపోతున్నారు. దిగువ ప్రాంతాలకు సాగునీరు తక్కువ ప్రవాహంతో అందుతుందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.