పాల్వంచమ్మర్రి నుండి జంగమ్మర్రి వరకు ఉన్న ఆర్ అండ్ బి రహదారి ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న మోరమ్ కొట్టుకుపోవడంతో రహదారి బలహీనమైంది. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్, ఎస్‌డిఆర్‌ఎఫ్/ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో రహదారి మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో రహదారిని పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు అనుకూలంగా మార్చే చర్యలు అధికారులు చేపట్టారు బుధవారం ఈ పనులను ఈఈ పంచాయతీరాజ్ మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.