నల్గొండ జిల్లా, నిడమనూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యను అందించాలన్నారు. కేజీబీవీ ఆవరణం, మౌలిక వసతులు, వంటగది, డ్రైనేజీ సిస్టం, స్టోర్ రూములను పరిశీలించి విద్యార్థులతో వంట గురించి, వంట సామాగ్రి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాడిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.