గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కొత్త తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మరిపెడ పరిధి కొత్తతండాలో మంగళవారం దుర్గమ్మ పండగ నిర్వహించారు. తండాలోని బంధువుల ఇంటికి వర్ధన్నపేట శివారు బండ తండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్(68) పండగకు హాజరయ్యారు. ఈ క్రమంలో భోజనం చేస్తుండగా లక్ష్మణ్ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. ఊపిరాడక అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు.