కావలి పట్టణంలో బుధవారం జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమం విజయవంతమైంది. ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వేలాదిగా మహిళలు పాల్గొన్నారు. మహిళలు సెల్ఫీ పాయింట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బ్రిడ్జి సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు మహిళలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అన్నారు.ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటల