అనంతపురంలో ఈనెల 10న జరిగే సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర నేత దేవినేని ఉమామహేశ్వరరావు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. అశేష జనవాహిణిని ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. శనివారం సాయంత్రం రాయదుర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చేలా కృషి చేయాలని కోరారు.