కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్ట్కర్, కలెక్టర్, ఎస్పీతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత, వరద ఉధృతి, నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు చేపట్టాలనరు