రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులను డాక్టర్ నవీన్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. నీరు నిల్వ ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలను నీటిగా ఉంచాలన్నారు. గడ్డి చెత్త చెదారం వల్ల దోమలు ఎక్కువగా ఉండే చోటా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.