తుగ్గలి మండలంలోని చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన రైతు చెట్నేపల్లి శ్రీనివాసులు (65) అప్పుల భారంతో మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. మూడెకరాల స్వంత భూమితో పాటు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసిన ఆయనకు రూ. 14 లక్షల వరకు అప్పులు అయ్యాయి. విషం తీసుకుని అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.