రజకులపై మాజీ మంత్రి పేర్ని నానిది కపట ప్రేమ అని శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం టీడీపీ కార్యలయంలో టీడీపీ నెత ఊకంటి రాంబాబు అన్నారు. సత్రంపాలెం ఘటనపై పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించిన ఆయన, వైసీపీ హయాంలో రజకుల ఇళ్ల కూల్చివేతలను గుర్తు చేశారు. పేర్ని నాని మంత్రిగా ఉన్న సమయంలో 30 మంది పేద రజకుల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. పేర్ని నాని రజకుల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారన్నారు.