పామూరు పట్టణంలోని ఒకటవ సచివాలయంలో సోమవారం శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీవో బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి అరవింద ఆధార్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.... సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజుకు 25 టోకెన్లను ఇవ్వడం జరుగుతుందని, ఆధార్ కు సంబంధించిన అన్ని అప్డేట్స్ సచివాలయంలో ప్రజలకు చేయడం జరుగుతుందన్నారు.