కనిగిరి పట్టణంలో ఇంటింటి ఫీవర్ సర్వేను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పక్కాగా చేపట్టాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ సూచించారు. కనిగిరిలోని 2 మరియు 18వ వార్డులలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వేను మున్సిపల్ చైర్మన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఇంటింటికి వెళ్లి జ్వర పీడితులను గుర్తించి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వచ్చి ఫీవర్ సర్వే చేస్తున్నారా అనే విషయాలను స్థానికులను మున్సిపల్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.