బెజ్జూరు రైతు వేదికలో మంగళవారం యూరియా కోసం లైన్లో నిలబడ్డ ఓ మహిళ రైతు స్పృహ తప్పి పడిపోయింది. బెజ్జూరు మండలానికి చెందిన మహిళ ఉదయం నుంచి యూరియా కూపన్ కోసం లైన్లో వేచి ఉండి ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది. అక్కడే ఉన్న స్థానిక రైతులు వెంటనే మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు పోయిన యూరియా ఇవ్వరా అంటూ రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు,