అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట-తాచేరు కాజ్వేను శుక్రవారం అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పరిశీలించారు. కాజ్వే వద్దకు వెళ్లి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి ప్రవాహంలోకి దిగి రాకపోకలు సాగించవద్దు అన్నారు. అదేవిధంగా వడ్డాది పెద్దేరు వంతెనను కూడా పరిశీలించారు. ఈ వంతెనకు రంధ్రం పడిన నేపథ్యంలో భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని బుచ్చయ్యపేట ఎస్సై శ్రీనివాసరావుని ఆదేశించారు.