మహబూబాబాద్ లో మంగళవారం ఉదయం ఫ్లై ఓవర్ దగ్గర మహర్షి స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పిల్లలకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును తెప్పించి విద్యార్థులను పాఠశాలకు పంపించారు. ఈ ఘటనలో బస్సు పాక్షికంగా దెబ్బతింది.