మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బిఐ బ్యాంక్ లో సిబ్బంది చేతివాటo ప్రదర్శించారు.బ్యాంకులో గత రెండు రోజులుగా బ్యాంకు అధికారులు, ఆడిట్ నిర్వహిస్తున్నారు.ఆడిట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. బ్యాంకులోని బంగారం, డిపాజిట్ లు, నగదులో లోపాలు ఉన్నాయని సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినట్లు సమాచారం బ్యాంకులో ఉన్నతాధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు