అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో తండ్రి పేరున ఉన్న పట్టా భూమిని. పెదనాన్న ఆయన కొడుకులు కబ్జా చేశారని ఆవేదన చెందిన కృష్ణప్ప కుమార్తె మంజుల గురువారం రెవెన్యూ అధికారుల సమక్షంలో పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు మంజులను మదనపల్లి జిల్లా ఆస్పత్రి తరలించారు .మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మంజుల గురువారం మాట్లాడుతూ తనకు ఎప్పటికీ న్యాయం జరగదు అందుకే అధికారుల సమక్షంలో చచ్చిపోవడానికి విషయం తాగానని ఆరోపించారు.