మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. గురువారం ఉదయం ఎంవిపి కాలనీ లో పరిసరాల పరిశుభ్రత పై గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారు అంద జేసిన గుడ్డ సంచులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్రలను జయప్రదం చేయాలని కోరారు. ఒక్కసారి వాడి వదిలేస్తే ప్లాస్టిక్ వద్దే వద్దని పేర్కొంటూ వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు.