మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్టీలు కొట్టిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు చోటుచేసుకుంది.. గ్రామంలో పొలం పనుల నిమిత్తం వెళ్తుండడంతో కాలువ కట్టపై దారి సరిగ్గా లేకపోవడంతో బోల్తా పడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.. ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ రైతు నల్లపు సత్యం అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.