భిక్కనూరు : మద్యం తాగి వాహనాన్ని నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బిక్కనూర్ మండలం మోటాట్ పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లు చెప్పారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ ఆంజనేయులు పేర్కొన్నారు.