నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బంది 689 మందికి శిక్షణనిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ కొనసాగింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఎలా వినియోగించాలి అనేది డీఆర్పీలు వివరించారు. పోలింగ్ సిబ్బంది ఏ విధంగా పనిచేయాలి.. ఎవరెవరు ఏయే విధులు నిర్వహించాలనేది వివరించారు. ఉదయం ఆర్వో రామ్మోహన్ రావు శిక్షణను ప్రారంభించారు.