టేకుల పాలెం లో మృతి చెందిన దేవరెద్దు: వేడుకగా అంత్యక్రియలు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలంలో ఓ దేవర ఎద్దు ఆదివారం ఉదయం 6గ. అనారోగ్యంతో మృతి చెందింది. ఆ ఎద్దును దేవత మూర్తిగా భావించే గ్రామస్తులు చనిపోయిన మనిషికి ఎంత వైభవంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో అంతకన్నా ఎక్కువగా వేడుక జరిపి చనిపోయిన దేవర ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి వివరాలు.. మదనపల్లె మండలం, టేకులపాలెలో ఆదివారం దేవర ఎద్దు మృతి చెందింది. దైవంగా భావించే ఆ ఎద్దును సాధారణ మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో అంతకు మించి గ్రామస్థులు ఆ ఎద్దుకు సాయంత్రం ఐదు గంటలకు ఘనంగా అంత్యక్రియలు జరిపారు