కౌటాల రైతు వేదికలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఏఈఓ గన్ షామ్ తీరుపై ఆగ్రహానికి లోనై ఏఈఓ తో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎప్పటినుండో వేచి చూస్తున్నా రైతులకు యూరియా ఇవ్వకుండా తనకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే యూరియాను ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారిని వెంటనే తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు,