వర్టికల్ సిబ్బంది అధికారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాను ముందు వరసలు ఉంచడానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతినెల నిర్వహించే క్రైమ్ రివ్యూ మీటింగ్ లో ఈ వర్టికల్ విభాగంలో ప్రదర్శన ఆధారంగా రివ్యూ నిర్వహించడం జరుగుతుందని అధికారులు సిబ్బంది క్రమం తప్పకుండా వర్టికల్ నియమాలను పాటిస్తూ మెరుగైన ప్రదర్శన చూపాలని ఎస్పి సూచించారు. 100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని నేరం తీవ్రతను తగ్గించాలన్నారు. పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.