నల్గొండ జిల్లా, మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. చండూరు ఆర్డీవో శ్రీదేవి, ఇన్చార్జి తహసిల్దార్ నరేష్ తో కలిసి గురువారం మధ్యాహ్నం యూరియా పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులను యూరియా సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో పద్మజా, సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.