Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
కలుషితమైన నీరు తాగి ఒక ఉపాధ్యాయుడు తో పాటు పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం ఉదయం 30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది ఈ మేరకు గాను ఉదయం టిఫిన్ చేసిన అనంతరం విద్యార్థులు త్రాగునీటిని సేవించారు ఆ నీరు కలిసితంగా ఉండడంతో ఒకసారిగా ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు సుమారు పదిమంది విద్యార్థులకు వాంతులు అయ్యాయి ఆ వెంటనే తాగు నీటిని పరిశీలించగా దుర్వాసన వచ్చింది. దీంతో అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థులను హుటాహుటిన చికిత్స నిమిత్తం వంద పడకల ఆసుపత్రికి తరలించారు.