కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పుష్కర ఘాట్ల వద్దకు చేరుకున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌటాల ఎస్సై గుంపుల విజయ్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని సూచించారు,