కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నిర్మించబడిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, అలాగే ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి పాల్గొని ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం కావడం వల్ల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కడప జిల్లాలో వైద్యరంగాన్ని మరింత అభివృద్ధి చేసి, సాధారణ ప్రజలకు సులభంగా వైద్యం అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు