తాంసి మండలం కప్పర్ల ప్రాథమిక పాఠశాలతో పాటు ఉన్నత పాఠశాలను గురువారం ఆర్డిఓ వినోద్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, రిజిస్టర్లను పరిశీలించారు.పాఠశాలలో వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ,అరై సంతోష్, జానియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులున్నారు.