హనుమకొండ జిల్లా,కమలాపూర్ మండలం కేంద్రంలో,శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం (పెద్ద రథం) కన్నుల పండువగా జరిగింది. ఉత్సవమూర్తులైన శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయస్వామి రథంపై గ్రామంలో ఊరేగించారు. వేలాది మంది భక్తులు హాజరై దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవంలో పాల్గొన్నారు. హనుమాన్ భక్తులు, కలిసి రథాన్ని లాగారు. జాతర వాతావరణం గ్రామమంతా ఆధ్యాత్మికతతో మార్మోగింది.