జగిత్యాల మండలం గుల్లపేట గ్రామానికి చెందిన న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గత కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ వ్యాధి వల్ల కలిగే శారీరక, మానసికవ్యధ తన గ్రామస్తులు పడకూడదనే మానవతా దృక్పథంతో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ భూతం పై సమర శంఖాన్ని పూరించారు. క్యాన్సర్ వ్యాధికి గల కారణాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ గ్రామంలో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు