నాసిరకమైన నిత్యవసర వస్తువులను అమ్ముతూ, తూకంలో మోసం చేస్తూ సూపర్ మార్కెట్ల యజమానులు ప్రజలను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏమైనా చేసుకోండి అని వినియోగదారులపైనే సూపర్ మార్కెట్ యజమానులు మండి పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓ వినియోగదారుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్ పై ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలోని పప్పుల శ్రీకాంత్ సూపర్ మార్కెట్లో వస్తువులను కొన్నాడు.