వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. గణేష్ మండప నిర్వాహకులు వినాయకుల ప్రతిమలను మండపాలకు తరలిస్తున్నారు. దీంతో నగరంలోని కంటేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, వినాయక్ నగర్, వర్ని రోడ్, తో పాటుగా పలు ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వినాయకుల విగ్రహాలను బ్యాండ్, డీజే చెప్పుల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాలతో మండపాలకు తరలిస్తున్నారు.