Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: హామీలు అమలు చేయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలి: వైసిపి కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ నారాయణ యాదవ్

Kanigiri, Prakasam | Sep 2, 2025
పామూరు మండలంలోని రేగి చెట్ల పల్లిలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మోసాలపై వైసీపీ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి నారాయణ యాదవ్ పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులను అరకొరగా విడుదల చేసి, ఆ వర్గాలను ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని నారాయణ యాదవ్ విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే వరకు వైసిపి పోరాటం చేస్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us