మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12:00 లకు ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ.. గాజాలో కొనసాగుతున్న మరణ హోమాన్ని ఆపాలన్నారు. పాలస్తీనా పసిబిడ్డల ఉసురుతీస్తున్న ఇజ్రాయిల్ పసి పిల్లలను కూడా వదలమని చేస్తున్న అమ్మానునీయ ప్రకటనలను మన దేశం ఖండించకపోవడం సిగ్గుచేటు అన్నారు. పాలస్థిన సమస్యకు న్యాయమైన శాంతియుత పరిష్కారం దిశగా అభివృద్ధి చేయాలని భారత్ ప్రభుత్వాన్ని కోరారు