జిల్లాలో సరైన రైతుకి సరైన మోతాదులో యూరియాని అందించాలని యూరియా ని దుర్వినియోగం కానీ వృథా కానీ చేయరాదని శనివారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ ఉద్యాన రెవిన్యూ అధికారులకు సూచించారు. యూరియా సరఫరా పై ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ప్రభుత్వ రంగ సంస్థలకు 70 శాతం ప్రైవేట్ ఏజెన్సీ వారికి 30 శాతం యూరియా అందజేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.