అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లి నల్లగుట్టలో 200 మంది పోలీసులు, డ్రోన్ తో పహార ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. నల్లగుట్టను ఆక్రమించి గొడవలు సృష్టించడానికి కొందరు బుద్ధుడి విగ్రహం పేరుతో గుట్టపైకి రావాలని ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని డీఎస్పీ చెప్పారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు, మీడియా సమావేశంలో ఇప్పటికే స్పష్టంచేసిన విషయం గుర్తుచేశారు.