26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయం నందు పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు జివిఆర్ ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది పేదల సొంతింటి కల నెరవేర్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు