అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లి నల్లగుట్టలో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటుచేసినట్లు డిఎస్పి మహేంద్ర తెలిపారు. శుక్రవారం సాయంత్రం నల్లగుట్టను పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. బుద్ధుడి విగ్రహం ఏర్పాటుకోసం సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు, రెవిన్యూ అధికారులు, మీడియా సమావేశంలో స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. నల్లగుట్టలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని డీఎస్పీ చెప్పారు