కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో బుధవారం ఉదయం కరెంట్ షాక్ తో యువకుడు చనిపోవడం తీవ్ర విషాదం నెలకొంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు రోదిస్తున్నారు. స్థానికులు సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేశారు. మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు.