యూరియా కోసం రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. పొద్దు గూకే సమయానికే యూరియా దుకాణాల ముందు ఆడ మగ అనే తేడా లేకుండా లైన్ లో గంటల తరబడి నిలబడటం, యూరియా సంచి దొరికితే సంతోషంగా వెనుదిరగడం, లేదా ఆవేదనతో వెళుతున్నారు. ఒక పక్క గత మూడు రోజులలో అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు మండల కేంద్రం లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం తో పాటు ప్రైవేట్ ఎరువుల దుకాణానికి 4 పర్యాయాలు యూరియా లోడ్ వచ్చినా రైతులకు సరిపోవడం లేదు. సోమవారం మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి 44 పై రైతులు యూరియా కోసం ఆందోళన కూడా చేశారు. ఆగ్రోస్ వద్ద యూరియా లోడ్ వస్తుందన్న సమాచారంతో లోడ్ రాక మునుపే రైతులు పెద్ద సంఖ్యలో లైన్ కట్టారు