కనిగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డు వడ్డెపాలెంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమకు ఆరు మాసాలుగా నీటి సరఫరా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సమస్యను మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ ... వడ్డే పాలెం కు కొత్తూరు లోని బోరు ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, హైవే నిర్మాణంలో భాగంగా ఆ బోరును హైవే అధికారులు పూడ్చివేశారన్నారు. వారితో మాట్లాడి నూతన బోరును ఏర్పాటు చేసి, నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.