కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం రేకుర్తి లోని సింహాద్రి కాలనీ రోడ్ నెంబర్ 3 లో ఉరి వేసుకొని నారాయణ అనే వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. ఇంట్లోని వారు ఉదయం లేచి చూస్తే సరికి ఉరి వేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృత దేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ ఊరి వేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.