ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం మునగాల మండలం ఆకుపాము గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలానికి చెందిన బానోతు సేవ్యా అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై కూరగాయలు అమ్ముకొని తిరిగి తన సొంత ఊరికి బయలుదేరాడు అదే సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు మనవడు బానోత్ సాయి భారత్ మెరుగు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.