నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణంలో విద్యుత్ అధికారులు స్తంభాలకు అమర్చిన సిటీకేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా హైదరాబాదులో ఆరుగురు వ్యక్తులు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందగా అప్రమత్తమైన ప్రభుత్వం ఈ ఘటనపై స్పందిస్తూ విద్యుత్ స్తంభాల పైన విద్యుత్తు వైర్లు తప్ప మరే వైర్లు ఉండవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు స్తంభాలకు వేసిన సిటీ కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించే కార్యక్రమాలను చేపట్టింది.