మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని గుత్తి మున్సిపల్ చైర్ పర్సన్ డి.వన్నూరుబి, కమిషనర్ బి.జబ్బార్ మియా అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులను మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ వన్నూరుబీ మాట్లాడుతూ వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించారని అన్నారు.