కామారెడ్డి పట్టణంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, బీసీ బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అందుకే సీబీఐ విచారణ కోరిందని అన్నారు. బీఆర్ఎస్ లో అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయని, కవిత హరీష్ రావు పై ఆరోపణలు చేయడం దీనికి నిదర్శనమని, అవినీతి జరిగినట్లు కవితనే వెల్లడించిందని ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. బీసీ బిల్లుతో బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.