ప్రపంచంలో అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలమయిందని దేశానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని సిపిఎం అగ్రనేత, పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పునరుద్ఘాటించారు. సోమవారం స్థానిక త్యాగరాజు భవనంలో సోషలిజం,విశిష్టత అంశంపై జిల్లా స్థాయి సెమినార్ సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ అధ్యక్షతన జరిగింది. గత రెండురోజులుగా జిల్లాలో వ్యవసాయ రంగంపై పరిశీలనకు జిల్లా పర్యటనకు వచ్చిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఈ సెమినార్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.