విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో జరిగిన పోరాటంలో అమరులైన వారికి గురువారం గుంటూరు నగరంలోని లాడ్జీ సెంటర్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ నాడు, నేడు చంద్రబాబు అధికారంలోకి ఉండగానే ప్రజలపై విద్యుత్ భారం మోపుతున్నారన్నారు. చంద్రబాబుకు విద్యుత్ ఛార్జీలు శాపంగా మారబోతోందని హెచ్చరించారు. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.